ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో విద్యార్థులకు నోట్బుక్కుల పంపిణీ
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఘనంగా నోట్బుక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి డాక్టర్ రామ్మోహన్, పూజారి వెంకటేశ్వర్లు విద్యార్థులకు స్వయంగా నోట్బుక్కులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ చేస్తున్న విశేష కృషిని వారు కొనియాడారు. కరోనా కష్టకాలంలో భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్లు, ఆహార ధాన్యాలు అందించి గొప్ప మానవతా దృక్పథాన్ని చాటిందని వారు గుర్తుచేశారు. విద్యార్థులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.