వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే దేశానికి అతిపెద్ద శక్తి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే దేశానికి అతిపెద్ద శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువత ప్రతిభ, నైపుణ్యాలపై ప్రపంచం ఎన్నో ఆశలు పెట్టుకుందని ఆయన తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా యువశక్తికి తగిన అవకాశాలు కల్పిస్తూ, దేశ నిర్మాణంలో వారిని కీలక భాగస్వాములుగా మారుస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు.