మహిళల రక్షణకు కోట్లతో సఖి కేంద్రాలు: సీఎం చంద్రబాబు భూమిపూజ

రిపోర్టర్: వెంకట్ స్థలం: Andhra Pradesh

మహిళల భద్రత కోసం ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన వన్ స్టాప్ సెంటర్స్ భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారని Telugu Desam Party వెల్లడించింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సఖి కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారని, రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆ పార్టీ స్పష్టం చేసింది.