ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ అధికారం నుండి వెళ్లిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ స్వయంగా తనతో అన్నారని రాహుల్ వెల్లడించారు. ఓట్ల చోరీ ఆరోపణలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేసిన ఆయన, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని తీవ్రంగా డిమాండ్ చేశారు.