వర్షపు నీటితో జలమయమై తీవ్రంగా చితికిపోతున్న ప్రధాన రహదారి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికే జలమయమవుతోంది. బుధవారం కురిసిన వర్షానికి కాలువలు లేక నీరు రోజుల తరబడి నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులతోపాటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు సాగక నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిని పరిశీలించిన నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూదికొండ మాణిక్యాలరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కట్టమూరి నూక అప్పారావు స్పందించి, ఇరువైపులా కాలువలు ఏర్పాటు చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.