రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ధ్వజం: విదేశీ జోక్యం కోరుతున్నారంటూ ఫైర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో విదేశీ జోక్యం కోరుతూ రాహుల్ గాంధీ పదేపదే ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లండన్ వేదికగా రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, దేశ అంతర్గత విషయాల్లోకి విదేశీ శక్తులను ఆహ్వానించడం తగదని కేశవన్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల విదేశీ పర్యటనలపై సమగ్ర వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది.