ప్రజాసేవకు నిలయంగా రూపుదిద్దుకుంటున్న నూతన పక్ష కార్యాలయం
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి రూరల్
తిరుపతి రూరల్ మండలం అవిలాల వద్ద శరవేగంగా నిర్మిస్తున్న తిరుపతి పార్లమెంట్ నూతన కార్యాలయ భవన పనులను తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఇంజినీర్లు, అధికారులతో మాట్లాడి నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత సమయానికే నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారానికి సమగ్ర వేదికగా ఈ నూతన కార్యాలయం నిలుస్తుందని లక్ష్మి స్పష్టం చేశారు. కార్యక్రమంలో యశ్వంత్ రెడ్డి, మునిరామయ్య, చెంగయ్య, రేవతి పాల్గొన్నారు.