విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాల పెంపే ప్రధాన లక్ష్యమన్న కలెక్టర్ శ్రీహర్ష

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పాఠశాలల్లో రెమిడియేషన్, ఖాన్ అకాడమీ, ఎఫ్.ఎల్.ఎన్. కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం, మాట్లాడడం వంటి నైపుణ్యాలను పెంపొందిస్తూ నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. ఏడు మండలాల ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణలో ఆయన పాల్గొని విద్యా ప్రమాణాలపై కీలక దిశానిర్దేశం చేశారు.