అర్నబ్ తుపాను బీభత్సం: మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, జలమయమైన కాలనీలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అల్లూరి సీతారామరాజు/పార్వతీపురం మన్యం

అర్నబ్ తుపాను ప్రభావంతో మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అరకు ఘాట్ రోడ్లలో వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. వేగావతి నది పొంగిపొర్లడంతో సాలూరు పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పర్యాటక ప్రాంతాలను మూసివేశామని, పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు అండగా నిలుస్తామని రాష్ట్ర మంత్రి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.