ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వాన్ని ఉపేక్షించబోమన్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ముందుండాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం ఎల్ నీనో పరిస్థితులపై అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.