మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా దుష్ప్రచారమని బాధితుడు స్పష్టం చేశారు. తాను ఎనిమిదేళ్లు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశానని, పోస్టల్ శాఖలోనూ ఉద్యోగం వచ్చినా టీచర్ కావాలనే ఉద్దేశంతోనే ఈ పరీక్ష రాశానని తెలిపారు. గత ప్రభుత్వంలోనూ తనకు ఉద్యోగం వచ్చిందని, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, జెన్యూన్ గానే ఎంపికయ్యానని తేల్చిచెప్పారు.