పాఠశాలల అభివృద్ధికి బాటలు వేస్తున్న ఎస్ఎంసీ ఎన్నికల పర్వం

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

చిట్వేల్ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 18న ఓటర్ల జాబితా రూపకల్పన చేసి, 25న తుది జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 29న విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని ఎంఈఓ ఖాజా మొహిద్దీన్, విద్యాశాఖ అధికారి ఈశ్వరయ్య ఉపాధ్యాయులను ఆదేశించారు.