ఎన్నికల పారదర్శకత కోసం రాహుల్ గాంధీ పోరాటం: నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: రమేష్ స్థలం: సూర్యాపేట

ఎన్నికల పారదర్శకతను కాపాడే దిశగా రాహుల్ గాంధీ సాగిస్తున్న ధైర్యమైన పోరాటం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చనీయాంశంగా మారిందని నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి - మంత్రి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించడంలో రాహుల్ గాంధీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ ఆయన చేస్తున్న ఈ నిరంతర పోరాటం ప్రజల్లో చైతన్యం తెస్తుందని పేర్కొన్నారు.