కూడసింగిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన నాయకులు
రిపోర్టర్: Thrinadh Rudi
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ కూడసింగి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ నరంజి ప్రసాదరావు, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకటో తేదీనే పింఛన్లు, వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు మర్రిచెట్టు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.