మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు నల్ల దుస్తులతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది దుర్యోధన, దుశ్శాసనుల పాలన అని విమర్శించారు. మహిళల కన్నీళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తాయని హెచ్చరించారు.