తిరుపతిలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన సదస్సు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గరుడ సర్కిల్ వద్ద క్యాబ్, ట్యాక్సీ మరియు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ రాజా పవన్ కుమార్, వైట్ కాల్ట్స్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతా నియమాలు, ప్రయాణికులతో నడుచుకోవాల్సిన తీరుపై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.