కాటారంలో విచిత్ర పరిస్థితి: ప్రజావాణికి ఒక్కటే దరఖాస్తు రావడంతో చర్చనీయాంశం
రిపోర్టర్: సురేష్
స్థలం: కాటారం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైందని ఎంపీడీవో ఏ. బాబు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పదాహార మంది అధికారులు హాజరయ్యారు. అయితే మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కేవలం ఒక్కటే దరఖాస్తు రావడంతో అధికారుల్ లో విస్మయం వ్యక్తమైంది. అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతుందనే అపనమ్మకమే ఇందుకు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు.