పాలకొండ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి విజయనిర్మల కళ్లుచెదిరే చారిత్రక విజయం సాధించారు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ నగరపంచాయతీ చైర్ పర్సన్ గా జనసేన అభ్యర్థి పల్లా విజయ నిర్మల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప వైసిపి అభ్యర్థిపై 6629 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం అందుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు రెండవసారి ఆమెను పీఠంపై కూర్చోబెట్టారు. పోలైన ఓట్లలో మెజారిటీ ఓట్లు జనసేన పార్టీ అభ్యర్థికే దక్కాయి.