అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు వాగులు వంకల పొంగిపొర్లు వైనం

రిపోర్టర్: హరి స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో సరాసరి మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా హుకుంపేట, జీకే వీధి, పెదబయలు, జి మాడుగుల, అనంతగిరి మండలాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులపై నుంచి వరద నీరు ప్రవహించగా వైద్య పరీక్షల కోసం వెళ్లిన 108 వాహనం బురదలో దిగబడిపోయింది. ఈ వర్షాలు వడలిపోతున్న ప్రత్తి, మిర్చి, కొబ్బరి, వరి పంటలకు జీవం పోశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.