ఏపీ కలెక్టర్ల సదస్సులో వినూత్న పాలనా విధానాల ప్రదర్శన
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలో కలెక్టర్ల సదస్సులో ఆయా జిల్లాల అధికారులు తమ ఉత్తమ విధానాలను ప్రదర్శించారు. అల్లూరి జిల్లాలో డ్రోన్లతో వైద్య సేవలు, అనంతపురంలో క్రీడా నైపుణ్యాల అన్వేషణ, బాపట్లలో ఆటిజం పిల్లల కోసం స్వర్ణ భవిత స్కూల్, కర్నూలులో సీడ్ పెల్లటైజేషన్ ద్వారా పంటల సాగు వంటి వినూత్న ప్రాజెక్టులను వివరించారు. ఈ ప్రయోగాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని తెలిపారు.