దేవుడి సొమ్మునూ వదలని సిబ్బంది.. నెల్లూరులో రూ.80.47 కోట్ల అక్రమాలు!
రిపోర్టర్: రాము
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో భారీ అవినీతి వెలుగుచూసింది. ఆలయాల ఆదాయం, కానుకలు, కౌలు నిధులను సిబ్బంది పక్కదారి పట్టించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.80.47 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆడిట్లో బయటపడింది. తల్పగిరి రంగనాథస్వామి, పెంచలకోనతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో నిధులు దుర్వినియోగమైనా అధికారులు నేటికీ లెక్కలు చెప్పకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది.