సోమశిల నిర్వాసితుల ఉపాధి జాబితాలో అక్రమాలు: అధికారులపై బాధితుల ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
సోమశిల ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాల ఉద్యోగాల జాబితాను అడ్డుపెట్టుకుని కొందరు ఇరిగేషన్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాల్గు దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నామని, అధికారులు మారుతున్న కొద్దీ అర్హుల జాబితా కూడా మారుతోందని వారు మండిపడ్డారు. నిబంధనల పేరుతో కాలయాపన చేస్తూ తమకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోయారు.