వానదేవుడి కరుణకై గుట్టపై మోకరిల్లిన పల్లెజనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆముదాలవలస
ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలోని బూర్జ, సరుబుజ్జిలి, పొందూరు మండలాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయారు. మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ అకస్మిక వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు ఎండ వేడిమి నుంచి స్థానికులకు ఎంతో ఉపశమనం లభించింది.