కూటమి సర్కార్ అప్పులపై శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర నిప్పులు

రిపోర్టర్: గోపి స్థలం: చీపురుపల్లి

కూటమి సర్కార్ దోపిడీ కోసమే అప్పులు చేస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చీపురుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల్ లో వైకాపా అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. దోపిడీకి తాను అవకాశం ఇవ్వనందునే కొందరు నాయకులు పార్టీ మారారని ఆరోపించారు. చీపురుపల్లిలో పరిపాలన అంతా పోలీస్ స్టేషన్లలోనే సాగుతోందని, ఏ కార్యాలయానికి వెళ్లినా లంచాలు ఇవ్వనిదే పనులు కావడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.