పాల్వాయి గ్రామంలో గణపతి ఉత్సవాలలో ఘనంగా అన్నప్రసాద వితరణ
రిపోర్టర్: వెంకటాపురం vishnu🙏
స్థలం: నల్గొండ
పాల్వాయి గ్రామంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జెడ్పీ హైస్కూల్ గల్లీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సహకారంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ద్వారా భక్తులకు క్రమపద్ధతిలో అన్నప్రసాదం అందజేశారు. యువత చేపట్టిన ఈ సామాజిక సేవను గ్రామ పెద్దలు ఎంతో అభినందించారు.