న్యూజిలాండ్ గడ్డపై సచిన్ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: Auckland

న్యూజిలాండ్ తో జరిగే తొలి వన్డే మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేశాడని క్రీడా వర్గాలు వెల్లడించాయి. కివీస్ గడ్డపై వన్డేల్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి మరో 139 పరుగులు అవసరమని విశ్లేషకులు తెలిపారు. ఇప్పటివరకు పదకొండు మ్యాచ్లు ఆడిన కోహ్లీ 514 పరుగులు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.