ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్: పెండింగ్ డీఏల విడుదలపై సీఎం నిర్ణయం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను అక్టోబర్ 1 నుంచి నగదు రూపంలో చెల్లించనున్నారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2022 సరెండర్ లీవ్ బకాయిలను సంక్రాంతికి, పోలీసులకు దసరా కానుకగా అదనపు సరెండర్ లీవ్ చెల్లిస్తామని ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమని స్పష్టం చేశారు.