విద్యార్థులలో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంచేందుకు వర్క్ బుక్ ఆవిష్కరించిన డిఈఓ
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల కలెక్టరేట్ లో శనివారం రెమిడియల్ తరగతుల ఆంగ్ల వర్క్ బుక్ ను జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రయ్య ఆవిష్కరించారు. విద్యార్థులలో భాషా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ వర్క్ బుక్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన స్థాయిలను గుర్తించి ప్రత్యేక బోధన అందించాలని ఆయన సూచించారు.