నెల్లూరు జిల్లాలో స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు: ఐదు బడులకు అవార్డుల ప్రదానం
రిపోర్టర్: నరేష్
స్థలం: Nellore
నెల్లూరు జిల్లాలో పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్న ఐదు బడులు స్వచ్ఛ పురస్కారాలకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం కలెక్టర్ ఈ అవార్డులను అందజేశారు. కలిగిరి ఆదర్శ పాఠశాల, ఏఎస్పేట జడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు నెల్లూరు, కావలి ప్రాంతాలలోని పాఠశాలలు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు సమష్టిగా శ్రమించి బడులను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు.