సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు హెచ్చరిక
రిపోర్టర్: హరి
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర పోలీసులు హెచ్చరించారు. అనుచిత మెసేజ్‌లు, అటాచ్‌మెంట్లు మరియు తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.