ఆవేశంలో మాట్లాడానంటూ పోలీసుల కస్టడీలో యూట్యూబర్ రావణ్ పశ్చాత్తాపం

రిపోర్టర్: మహేష్ స్థలం: కృష్ణా

యూట్యూబ్లో వ్యూవర్స్ పెంచుకునేందుకే ఆవేశంతో మాట్లాడానని, తన వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని దేశద్రోహం కేసులో అరెస్టైన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ అలియాస్ ప్రశ్న రావణ్ పోలీసుల ఎదుట పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు గన్నవరం పోలీసులు తెలిపారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసిన కేసులో వారం రోజుల కస్టడీ ముగియడంతో రావణ్ను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం అతనికి అక్టోబరు 8 వరకు రిమాండ్ను పొడిగించింది.