దసరా నుంచి న్యూజిలాండ్ మార్కెట్లో మేక్ ఇన్ ఇండియా సత్తా

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

న్యూజిలాండ్ మార్కెట్లో మేక్ ఇన్ ఇండియా సత్తా చాటుతోందని బీజేపీ తెలంగాణ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యంతో దసరా నుంచి సున్నా కస్టమ్స్ డ్యూటీతో మన ఎగుమతులకు రెక్కలు రానున్నాయని వెల్లడించింది. అక్టోబర్ 20 నుంచి న్యూజిలాండ్‌కు చేసే ఎగుమతులపై 100 శాతం కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు లభించనుండగా, ప్రపంచ యవనికపై భారత వాణిజ్య జెండా సగర్వంగా రెపరెపలాడుతోందని తెలిపింది.