పురుషోత్తపురంలో ప్రమాదకరంగా వాలిన విద్యుత్ స్తంభం తొలగించాలని డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సరుబుజ్జిలి
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలోని ఫకీరసాహెబ్ పేటలో వీధి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం వీచిన తుఫాన్ గాలులకు ఒకవైపునకు తీవ్రంగా వాలిపోయింది. ఎప్పుడూ కూలిపోతుందోనని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం జరగకముందే ఆ స్తంభాన్ని నిటారుగా మార్చాలని లేదా కొత్తది ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.