రోలుగుంట మండలం నిండుగొండలో ఘనంగా గ్యార్వి షరీఫ్ వేడుకలు

రిపోర్టర్: G TAMMUNAIDU స్థలం: రోలుగుంట

రోలుగుంట మండలం నిండుగొండ గ్రామంలోని మస్జిద్ ప్రాంగణంలో ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో గ్యార్వి షరీఫ్ జల్సా వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక సభకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మౌలానా ముహమ్మద్ అబ్దుల్ వహిద్ రాజా సాహిబ్ ఇస్లామిక్ ధర్మ సూత్రాలపై ప్రసంగించారు. అనంతరం భక్తులకు లంగర్ ఎ గౌసియా మహా అన్నదానం పంపిణీ చేయగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.