మున్సిపల్ పోలింగ్ కేంద్రాలకు రెండు రోజుల పాటు జిల్లా యంత్రాంగం సెలవులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పార్వతీపురం మన్యం జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు అక్టోబర్ ముప్పై ఒకటి, నవంబర్ మొదటి తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర రెడ్డి తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.