తెల్ల కాగితం చిత్రం నుంచి తెలుసా తెలుసా పాట విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రంలోని ‘తెలుసా తెలుసా’ మెలోడీ గీతాన్ని అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది.