'స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవం': తిరుమలలో సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
రిపోర్టర్: శివ
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర ఆధ్వర్యంలో సీఎం కుటుంబసభ్యులు మంత్రి లోకేశ్, బ్రాహ్మణితో కలిసి బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాల తట్టను తలపైకెత్తుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించగా సీఎం దంపతులు వాహనసేవలో పాల్గొన్నారు.