టాలీవుడ్‌లో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న మత్స్య గ్లింప్స్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం మత్స్య చిత్ర గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు. టాప్ క్వాలిటీ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందిన ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంతో వివస్వాన్ తెలుగు తెర‌కు పరిచయమవుతున్నారు.