స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలన్న డిప్యూటీ సీఎం పవన్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కాకినాడ అర్బన్
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడలో జనసేన నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. వివిధ స్థాయిల నాయకులు ఈ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం పొందారని గంగాధరనెల్లూరు సమన్వయకర్త కంజేరి చందు తెలిపారు.