విద్యుత్ పొదుపుతోనే మెరుగైన సరఫరా సాధ్యం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

వర్షాభావ పరిస్థితుల కారణంగా జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని విద్యుత్ శాఖ ఏడీ ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో ఉత్పత్తిపై ప్రభావం పడిందన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. వినియోగదారులు విద్యుత్ వృథా చేయకుండా అత్యవసరమైన వాటికే వాడాలని, అవసరం లేని సమయాల్లో లైట్లు, ఫ్యాన్లు ఆపివేయాలని సూచించారు.