మంథని పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పరుగులు పెట్టిస్తున్న అధికారులు

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా మంథనిలో రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర ఘాట్ పునర్నిర్మాణానికి ఇరవై మూడు కోట్లు, ఆలయ అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఘాట్ పనులను పరిశీలించి మార్చి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.