కాంగ్రెస్ పై విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చిన వంశీచంద్ రెడ్డి

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి కోరారు. ఆమనగల్లు, కడ్తాల్ మండలాల నాయకులు ఆదివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న కుట్ర రాజకీయాలను నాయకులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.