జాజిరెడ్డిగూడెంలో ఎస్బీఐ బ్యాంకు తరలింపును వ్యతిరేకిస్తూ గ్రామస్థుల భారీ ధర్నా
రిపోర్టర్: సురేష్
స్థలం: జాజిరెడ్డిగూడెం
జాజిరెడ్డిగూడెంలో ఎస్బీఐ బ్యాంకు శాఖను వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. 1985 నుండి కొనసాగుతున్న ఈ శాఖను మార్చడం వల్ల రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. తరలింపు టెండర్లను రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అధికారులు హెచ్చరించారు.