న్యూఢిల్లీలో మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఢిల్లీ
న్యూఢిల్లీలోని మూడు ప్రముఖ పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హౌజ్ ఖాస్‌లోని మదర్ ఇంటర్నేషనల్ స్కూల్, చాణక్యపురిలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్ మరియు బాల్ భారతి పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టగా, ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.