ప్రత్యేక యాప్ లేకుండానే ఆన్లైన్ సేవలు అందిస్తున్నామని అనంతపురం పోలీస్ వెల్లడి

రిపోర్టర్: సతీష్ స్థలం: అనంతపురం

అనంతపురం పోలీస్ శాఖ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ సేవల గురించి ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఏవైనా ఫిర్యాదులు చేయాలన్నా, ఎఫ్ఐఆర్ ప్రతులు పొందాలన్నా, వెరిఫికేషన్ లేదా ఈ-చలాన్ల చెల్లింపుల కోసం ఎలాంటి ప్రత్యేక యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని Anantapur Police స్పష్టం చేశారు. నేరుగా అధికారిక వెబ్సైట్ ద్వారా అన్ని రకాల సేవలను సులభంగా ఆన్లైన్లో పొందవచ్చని పేర్కొంటూ ప్రజలకు తగిన సూచనలు చేశారు.