భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్: భారత్ జట్టు ఎదురుదెబ్బ

రిపోర్టర్: సతీష్ స్థలం: Lincoln

న్యూజిలాండ్ ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్ ఏ జట్టు కష్టాల్లో పడిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ మూడు వందల పదిహేడు పరుగులు చేసి రెండు వందల నాలుగు పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తక్కువ పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.