సీఎం సొంత ఊరిలో రైతుల ఆందోళనపై భట్టి విచారం

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం వద్ద రైతులు ధర్నా చేయడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొన్నారు. సాగునీరు, విద్యుత్ సమస్యలపై ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎల్ నినో ప్రభావం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయని, ప్రభుత్వ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.