డిసెంబర్ టీఈఈ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగించిన ఇగ్నో
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిసెంబర్ 2026 టర్మ్ ఎండ్ పరీక్షల ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 7వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. గడువులోపు దరఖాస్తు చేసుకోలేని వారు అక్టోబర్ 8 నుండి 15వ తేదీ వరకు రూ.1100 ఆలస్య రుసుముతో అప్లై చేసుకోవడానికి మరో అవకాశం కల్పించారు.