నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య

రిపోర్టర్: సతీష్ స్థలం: Nizamabad

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యారు. కారులో వచ్చిన దుండగుడు నడిరోడ్డుపై అతన్ని కత్తితో నరికి చంపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో అదనపు కట్నం విషయంలో నాలుగు నెలల గర్భిణిగా ఉన్న వైష్ణవిని భర్త హరిబాబు హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.