గుర్గావ్లో మహిళ బైక్ను ఢీకొట్టిన కారు, నలుగురు అరెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Haryana
గుర్గావ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో మహిళ బైక్ను కారుతో వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ప్రస్తుతం తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు ఆమె కుటుంబం తెలిపింది.